Telangana University: తెలంగాణ వర్సిటీలో విద్యార్థిని బలవన్మరణం

Telangana University Student Ashwini Commits Suicide
  • తెలంగాణ యూనివర్శిటీ సౌత్ క్యాంపస్‌లో ఘటన
  • హాస్టల్ గదిలో ఉరివేసుకొని మృతి చెందిన పీజీ విద్యార్ధిని అశ్విని 
  • యాజమాన్యంపై విద్యార్ధులు ఆగ్రహం 
  • అత్యవసర వాహనాన్ని ధ్వంసం చేసిన విద్యార్థులు
కామారెడ్డి జిల్లా బిక్కనూరులోని తెలంగాణ యూనివర్సిటీ (టీయూ)లో విషాదం చోటు చేసుకుంది. సౌత్ క్యాంపస్ హాస్టల్ గదిలో ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

పీజీ తెలుగు విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న బీర్కూరు మండలం కిష్ణాపూర్ గ్రామానికి చెందిన అశ్విని (24) హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అశ్వినిని ఆసుపత్రికి తరలించేందుకు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

క్యాంపస్ ఆవరణలో అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి ఉపయోగించే వాహనాన్ని విద్యార్థులు ధ్వంసం చేశారు. డ్రైవర్‌పై దాడి చేశారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Telangana University
Ashwini
Telangana University suicide
student suicide
Kamareddy
Bikkannur
Kishnapur village
hostel
PG Telugu

More Telugu News