Allu Aravind: సనాతన ధర్మం గురించి పవన్ కల్యాణ్ చెబుతుంటే మంత్రముగ్ధులం అయిపోతాం: అల్లు అరవింద్

Allu Aravind Praises Pawan Kalyans Knowledge of Sanatana Dharma
  • మహావతార్ నరసింహ చిత్రం సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ వ్యాఖ్యలు 
  • సనాతన ధర్మంపై పవన్ కల్యాణ్ కు అపారమైన జ్ఞానం ఉందని వెల్లడి
  • ఆయన మహావతార్ నరసింహ చిత్రాన్ని చూడాలని విజ్ఞప్తి  
మహావతార్ నరసింహ చిత్రం సక్సెస్ మీట్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతుంటే ఎవరైనా మంత్రముగ్ధులు అయిపోవాల్సిందేని అన్నారు. సనాతన ధర్మం గురించి పవన్ కల్యాణ్ కు అపారమైన అవగాహన ఉందని తెలిపారు. 

తనకు తెలిసిన వాళ్లలో గానీ, తమ కుటుంబ సభ్యుల్లో గానీ... పవన్ కు తెలిసినంతగా సనాతన ధర్మం గురించి తెలిసిన వాళ్లు ఇంకెవరూ లేరని కొనియాడారు. పవన్ కల్యాణ్ 'మహావతార్ నరసింహ' చిత్రం చూడాలని, ఈ సినిమా గురించి మాట్లాడాలని కోరుకుంటున్నానని అల్లు అరవింద్ తెలిపారు. 

కాగా, ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన 'మహావతార్ నరసింహ' 4 రోజుల్లోనే రూ.79 కోట్లు రాబట్టడం విశేషం. కన్నడ చిత్రనిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులో అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ విడుదల చేసింది. 
Allu Aravind
Pawan Kalyan
Sanatana Dharma
Mahavatar Narasimha
Geetha Arts
Hombale Films
Telugu Cinema
AP Deputy CM
Tollywood
Movie Success Meet

More Telugu News