AP DSC 2025: మెగా డీఎస్సీ అభ్యర్ధులకు కీలక అప్డేట్ ..ఫలితాలు ఎప్పుడంటే..?

AP DSC 2025 Results Expected by 15th of This Month
  • ఈ నెల 15వ తేదీలోగా మెగా డీఎస్సీ ఫలితాలు!
  • నెలాఖరులోగా కొత్త టీచర్లకు పోస్టింగ్‌లు ఇచ్చే అలోచనలో విద్యాశాఖ
  • సెప్టెంబర్ మొదటి వారం నుంచి పాఠశాలలకు 16,347 మంది కొత్త టీచర్లు
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం ఇది. ఇప్పటికే డీఎస్సీ ఫైనల్ కీ విడుదల కాగా, అభ్యర్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మెగా డీఎస్సీ 2024 ఫలితాలను ఈ నెల 15వ తేదీలోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.

ఈ నెల 16వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించి, నెలాఖరులోగా కొత్త ఉపాధ్యాయుల పోస్టింగ్‌లు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. క్రీడల కోటాలో ఉన్న 421 పోస్టులకు సంబంధించిన వివరాలు ఇంకా శాప్ నుంచి అందాల్సి ఉంది. ఆ వివరాలు రాగానే జిల్లాల్లో కటాఫ్ మార్కులు ప్రకటిస్తారు. ఈ లోగా మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు.

కొత్తగా విధుల్లో చేరే 16,347 మంది ఉపాధ్యాయులకు వారాంతాల్లో శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ శిక్షణ పోస్టింగ్‌లకు ముందే పూర్తి చేస్తారు. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో, చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. కాబట్టి, నాలుగైదు శని, ఆదివారాల్లో శిక్షణ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా పోస్టింగ్‌ల ప్రక్రియ పూర్తయితే, సెప్టెంబర్ మొదటి వారం నుంచే కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో చేరనున్నారు. 
AP DSC 2025
Mega DSC
AP DSC Results
School Education Department
Teacher Recruitment
AP Teachers
Certificate Verification
Teacher Training
Andhra Pradesh Education
AP DSC Cutoff Marks

More Telugu News