Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యల ఎఫెక్ట్ .. ఎమ్మెల్సీ దువ్వాడపై కేసు నమోదు

Case Filed Against MLC Duvvada Over Comments on Pawan Kalyan
  • పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్సీ దువ్వాడ ఆరోపణలు
  • దువ్వాడపై హిరమండలం పీఎస్‌లో జనసేన నేత ఫిర్యాదు
  • దువ్వాడకు నోటీసులు ఇచ్చిన పోలీసులు
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత ఆరోపణలు చేసిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. శ్రీకాకుళం జిల్లా హిరమండలం పోలీస్ స్టేషన్‌లో దువ్వాడపై కేసు నమోదు చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దువ్వాడ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ప్రశ్నించడానికి వచ్చానని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నెలకు రూ.50 కోట్ల చొప్పున సీఎం చంద్రబాబు నుంచి తీసుకుంటూ ప్రశ్నించడం లేదని విమర్శలు చేశారు.

దువ్వాడ చేసిన ఈ వ్యాఖ్యలపై హిరమండలం జనసేన నాయకుడు పంజరాపు సింహాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన హిరమండలం పోలీసులు నిన్న ఎమ్మెల్సీ దువ్వాడకు టెక్కలి సమీపంలోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు. 
Pawan Kalyan
Duvvada Srinivas
AP Deputy CM
YSRCP MLC
Defamation Case
Srikakulam
Hiramandalam Police
Chandrababu Naidu
Janasena
Andhra Pradesh Politics

More Telugu News