Prajwal Revanna: పనిమనిషిపై అత్యాచారం కేసు.. మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు

Prajwal Revanna sentenced to life in rape case
  • రూ. 10 లక్షల జరిమానా విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు
  • బాధితురాలికి రూ. 7 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశం
  • నిన్న దోషిగా తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం
పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు విధిస్తూ బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అంతేకాకుండా రూ. 10 లక్షల జరిమానా విధించింది. బాధితురాలికి రూ. 7 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

ఈ అత్యాచారం కేసులో ఇటీవల విచారణ పూర్తి చేసిన న్యాయమూర్తి సంతోష్ గజానన హెగ్డే, మాజీ ఎంపీని దోషిగా నిర్ధారించారు. నిన్న దోషిగా తేల్చిన సమయంలో, ఈరోజు శిక్ష ఖరారు చేయడానికి ముందు ప్రజ్వల్ రేవణ్ణ కన్నీటిపర్యంతమయ్యారు. న్యాయస్థానం వెలుపల ఆయన విలపించారు.

కేఆర్ నగర్‌కు చెందిన ఓ మహిళ 2024 ఏప్రిల్ 28న హొళెనరసీపుర పోలీస్ స్టేషన్‌లో ప్రజ్వల్ రేవణ్ణ తనపై అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. గన్నిగడ ఫాంహౌస్‌లో తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ తరువాత ప్రజ్వల్‌పై మరికొన్ని అత్యాచార కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసులో నిన్న ప్రజ్వల్‌ను దోషిగా తేల్చిన కోర్టు, నేడు శిక్షను ఖరారు చేసింది.
Prajwal Revanna
Prajwal Revanna rape case
Karnataka MP
Sexual assault case
Holenarasipura

More Telugu News