Yuzvendra Chahal: ఆర్జే మహ్వశ్‌తో డేటింగ్ రూమర్స్‌పై నోరు విప్పిన చాహల్.. అసలు నిజం ఇదేనంటూ ఫుల్ క్లారిటీ!

Yuzvendra Chahal Clarifies Dating Rumors with RJ Mahvash
  • ఆర్జే మహ్వశ్‌తో డేటింగ్‌పై స్పందించిన యజువేంద్ర చాహల్
  • తమ మధ్య ఏమీ లేదని ఖరాఖండిగా వెల్లడి
  • సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందన్న చాహల్
  • తన వల్ల మహ్వశ్‌ ట్రోలింగ్ బారిన పడటం బాధించిందన్న క్రికెటర్
  • విడాకుల తర్వాత ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేనని స్పష్టీకరణ
భారత క్రికెటర్ యజువేంద్ర చాహల్, రేడియో జాకీ (ఆర్జే) మహ్వశ్‌ మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది. ఈ వదంతులపై చాహల్ నేరుగా స్పందించి పూర్తి స్పష్టతనిచ్చాడు. తమ మధ్య ఎలాంటి ప్రేమ సంబంధం లేదని ఆయన ఖరాఖండిగా తేల్చిచెప్పాడు.

ధనశ్రీ వర్మతో విడాకులైన తర్వాత చాహల్, ఆర్జే మహ్వశ్‌తో డేటింగ్‌లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా దుబాయ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ సందర్భంగా వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో తాజాగా రాజ్ శ్యామని పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన చాహల్, ఈ రూమర్స్‌పై మౌనం వీడాడు.

"మహ్వశ్‌, నా మధ్య అలాంటిదేమీ లేదు. ప్రజలు ఏది కావాలంటే అది అనుకోవచ్చు. ప్రస్తుతం నా దృష్టంతా వ్యక్తిగత జీవితాన్ని చక్కదిద్దుకోవడంపైనే ఉంది. నేను ఎవరితోనూ డేటింగ్‌లో లేను" అని చాహల్ స్పష్టం చేశాడు. ఓ డిన్నర్‌లో తాము స్నేహితులతో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో కొందరు క్రాప్ చేసి, కేవలం ఇద్దరమే ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేశారని ఆయన వివరించారు. అలాగే, మహ్వశ్‌ తనకు ఎయిర్‌పోర్ట్‌కు లిఫ్ట్ ఇస్తానని చెప్పిన ఓ సాధారణ వీడియోను కూడా వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ పుకార్ల వల్ల తాను, మహ్వశ్‌ తీవ్రమైన ట్రోలింగ్‌కు గురయ్యామని చాహల్ తెలిపాడు. ముఖ్యంగా మహ్వశ్‌ను 'సంసారాన్ని కూల్చిన వ్యక్తి' (హోమ్‌రెకర్) అంటూ దారుణంగా దూషించడం తనను తీవ్రంగా బాధించిందని అన్నారు. తన వల్ల ఆమె అనవసరంగా నిందలు మోయాల్సి రావడం చాలా దారుణమని పేర్కొన్నాడు. 

మరోవైపు, మహ్వశ్‌ కూడా సోషల్ మీడియా వేదికగా ఈ వదంతులను పలుమార్లు ఖండించిన విష‌యం తెలిసిందే. తాను సింగిల్‌గానే ఉన్నానని, తనపై వచ్చే ఆరోపణల్లో నిజం లేదని ఆమె స్పష్టం చేస్తూ వస్తున్నారు. చాహల్ తాజా వివరణతోనైనా ఈ అనవసర ప్రచారానికి ముగింపు పలుకుతారని పలువురు భావిస్తున్నారు.
Yuzvendra Chahal
Chahal
RJ Mahvash
Dhanashree Verma
Yuzvendra Chahal dating rumors
Indian cricketer
ICC Champions Trophy 2025
Raj Shamani podcast
Chahal divorce
cricket news

More Telugu News