పిల్లల ఆస్తమా చికిత్సలో కీలక ముందడుగు.. మందులకు లొంగని ఉబ్బసానికి కారణాలు ఇవే!
- చికిత్స తీసుకున్నా పిల్లల్లో ఆస్తమా తగ్గకపోవడానికి కారణాల గుర్తింపు
- ఇసినోఫిలిక్ ఆస్తమాలో మూడు కొత్త ఇన్ ఫ్లమేటరీ మార్గాల ఆవిష్కరణ
- వైరల్ ఇన్ఫెక్షన్లు, శ్లేష్మం కూడా ఉబ్బసాన్ని తీవ్రతరం చేస్తున్నాయని వెల్లడి
మందులు వాడుతున్నా కొందరు పిల్లల్లో ఆస్తమా ఎందుకు అదుపులోకి రావడం లేదు? ఈ కీలక ప్రశ్నకు శాస్త్రవేత్తలు సమాధానం కనుగొన్నారు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ పిల్లల్లో ఉబ్బసం తీవ్రమవడానికి దోహదపడే కొన్ని కొత్త వాపు కారక మార్గాలను (ఇన్‌ఫ్లమేటరీ పాత్‌వేస్) గుర్తించామని, ఇది భవిష్యత్తులో మెరుగైన చికిత్సలకు దారితీస్తుందని వారు చెబుతున్నారు. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ సైన్స్ జర్నల్ 'జమా పీడియాట్రిక్స్'లో ప్రచురితమయ్యాయి.
సాధారణంగా 'ఇసినోఫిలిక్ ఆస్తమా' అనేది ఒక రకమైన తెల్ల రక్తకణాలైన ఇసినోఫిల్స్ ఊపిరితిత్తుల్లో అధికంగా చేరడం వల్ల వస్తుంది. దీనికి 'టైప్ 2 (టీ2) ఇన్ఫ్లమేషన్' అనే రోగనిరోధక ప్రతిస్పందన కారణం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు ఈ టీ2 ఇన్‌ఫ్లమేషన్‌ను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయి. అయినప్పటికీ, కొందరు పిల్లల్లో ఆస్తమా ఎటాక్స్ వస్తూనే ఉంటాయి. దీనిపై అమెరికాలోని ఆన్ అండ్ రాబర్ట్ హెచ్. లూరీ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆఫ్ షికాగో పరిశోధకులు దృష్టి సారించారు.
ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ రాజేశ్ కుమార్ మాట్లాడుతూ "టీ2 ఇన్‌ఫ్లమేషన్‌ను లక్ష్యంగా చేసుకుని చికిత్స అందిస్తున్నప్పటికీ, కొందరు పిల్లల్లో ఆస్తమా ఎటాక్స్ వస్తూనే ఉన్నాయి. దీనిని బట్టి ఇతర ఇన్‌ఫ్లమేటరీ మార్గాలు కూడా ఇందులో పాత్ర పోషిస్తున్నాయని స్పష్టమవుతోంది" అని వివరించారు. తమ పరిశోధనలో భాగంగా, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న పిల్లల నుంచి 176 ముక్కు శాంపిల్స్‌ను సేకరించి, వాటిపై ఆర్ఎన్ఏ సీక్వెన్సింగ్ నిర్వహించారు.
ఈ విశ్లేషణలో ఆస్తమాను తీవ్రతరం చేసే మూడు కొత్త మార్గాలను గుర్తించారు
ఎపిథీలియల్ ఇన్ఫ్లమేటరీ మార్గాలు: చికిత్స తీసుకుంటున్న పిల్లల్లో సైతం ఇవి చురుకుగా ఉంటున్నాయి.
మాక్రోఫేజ్ ప్రేరిత ఇన్‌ఫ్లమేషన్: ఇది ప్రత్యేకంగా వైరల్ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు కనిపిస్తోంది.
అధిక శ్లేష్మం, కణ ఒత్తిడి: చికిత్స తీసుకుంటున్న, తీసుకోని ఇరు గ్రూపుల పిల్లల్లో ఉబ్బసం తీవ్రమైనప్పుడు ఇది గమనించారు.
"మందులు వాడుతున్నా ఉబ్బసం తీవ్రమైన పిల్లల్లో ఎలర్జీ రకానికి చెందిన ఇన్‌ఫ్లమేషన్ తక్కువగా ఉందని, కానీ ఎపిథీలియల్ వంటి ఇతర మార్గాలు వారిలో ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమవుతున్నాయని మేము గుర్తించాం" అని డాక్టర్ కుమార్ తెలిపారు. పిల్లల్లో ఆస్తమా చాలా సంక్లిష్టమైనదని, ఈ పరిశోధన ఫలితాలు ఒక్కొక్కరి సమస్యకు అనుగుణంగా ప్రత్యేక చికిత్సలు (పర్సనలైజడ్ ట్రీట్‌మెంట్) రూపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయని ఆయన అన్నారు. ఈ ఆవిష్కరణ, ఆస్తమాతో బాధపడుతున్న చిన్నారుల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.