Anasuya: ‘చెప్పు తెగుద్ది’.. అనసూయ వార్నింగ్ వీడియో వైర‌ల్‌!

If You Make Obscene Comments You Will Be Beaten Anasuya Fires At Fans
  • ప్ర‌కాశం జిల్లా మార్కాపురంలోని ఓ షాపింగ్‌మాల్ ఓపెనింగ్‌లో పాల్గొన్న అన‌సూయ‌
  • ఆమె మాట్లాడుతున్న స‌మ‌యంలో కొంద‌రు ఆక‌తాయిల అసభ్య కామెంట్లు
  • వారికి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన అన‌సూయ‌.. నెట్టింట వీడియో వైర‌ల్‌
సినీ న‌టి, యాంక‌ర్ అన‌సూయ తాజాగా ప్ర‌కాశం జిల్లా మార్కాపురంలోని ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవం‌లో పాల్గొన్నారు. అక్క‌డ‌ త‌న‌పై కొంద‌రు యువ‌కులు అసభ్య కామెంట్లు చేయ‌డంతో 'చెప్పు తెగుద్ది' అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
వివరాలలోకి వెళితే, ఈ కార్య‌క్ర‌మంలో అన‌సూయ మాట్లాడుతున్న స‌మ‌యంలో అక్క‌డికి వ‌చ్చిన కొంద‌రు ఆక‌తాయిలు కామెంట్లు చేయ‌డం మొద‌లుపెట్టారు. 

దీంతో అన‌సూయ వారికి గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చారు. 'చెప్పు తెగుద్ది.. మీ ఇంట్లో అమ్మ, చెల్లి, భార్య కుటుంబ స‌భ్యుల‌ను ఇలాగే కామెంట్లు చేస్తే ఊరుకుంటారా. పెద్ద‌వాళ్ల‌కి మ‌ర్యాద ఇవ్వ‌డం మీ ఇంట్లో నేర్పలేదా? వెరీ బ్యాడ్‌' అంటూ అన‌సూయ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది.
Anasuya
Anasuya Bharadwaj
Prakasam district
Markapuram
Shopping mall opening
Viral video
Misbehavior
Warning
Telugu actress
Anchor

More Telugu News