Nandamuri Balakrishna: 'భగవంత్ కేసరి' చిత్రానికి జాతీయ అవార్డు... బాలకృష్ణ స్పందన

Nandamuri Balakrishna Reacts to Bhagavanth Kesari National Award
  • 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించిన కేంద్రం 
  • జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి
  • అపారమైన గర్వకారణంటూ బాలకృష్ణ ప్రకటన
71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో 'భగవంత్ కేసరి' చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. ఇవాళ జాతీయ అవార్డుల జ్యూరీ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. దీనిపై భగవంత్ కేసరి కథానాయకుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. 

"71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో 'భగవంత్ కేసరి' ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం నాకు అపారమైన గర్వకారణం. ఈ గౌరవం మొత్తం మా చిత్ర బృందానికి చెందుతుంది. షైన్ స్క్రీన్స్ (ఇండియా) ఎల్ఎల్ పీ తరఫున చిత్ర నిర్మాతలు సాహు గారపాటి గారు, హరీష్ పెద్ది గారు... ఈ కథను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు అనిల్ రావిపూడి గారు... అలాగే ప్రతి కళాకారుడు, సాంకేతిక నిపుణుడు, సిబ్బంది అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది. 

జాతీయ అవార్డుల జ్యూరీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారతదేశంలోని ఇతర జాతీయ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. వారి ప్రతిభ భారతీయ సినీ రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళుతుంది. ఈ గుర్తింపు మాకు మరింత స్ఫూర్తినిస్తూ... ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకే శక్తివంతమైన కథలను అందించాలన్న మా తపనను మరింత బలపరుస్తోంది... జై హింద్" అంటూ బాలకృష్ణ తన ప్రకటనలో పేర్కొన్నారు.

Nandamuri Balakrishna
Bhagavanth Kesari
National Film Awards
Anil Ravipudi
Telugu cinema
Shine Screens India
Sahu Garapati
Harish Peddi
Indian cinema

More Telugu News