India vs England: ఓవల్ టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో భారత్ 224 ఆలౌట్... వచ్చీ రావడంతోనే ఇంగ్లండ్ ఓపెనర్ల బాదుడు

India vs England India all out for 224
  • లండన్ లో చివరి టెస్టు
  • రెండో రోజు ఆట ఆరంభంలోనే ఇన్నింగ్స్ ముగించిన టీమిండియా
  • 5 వికెట్లతో దెబ్బతీసిన ఆట్కిన్సన్
ఓవల్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 224 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ సీమర్ గస్ ఆట్కిన్సన్ 5 వికెట్లతో భారత్ ను దెబ్బకొట్టాడు. ఓవర్ నైట్ స్కోరు 204-6తో ఇవాళ రెండో రోజు ఆటలో బరిలో దిగిన టీమిండియా... మరో 20 పరుగుల వ్యవధిలోనే చివరి 4 వికెట్లను చేజార్చుకుంది. కరుణ్ నాయర్ తన ఓవర్ నైట్ స్కోరు (52)కు మరో 5 పరుగులు మాత్రమే జోడించి జోష్ టంగ్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. వాషింగ్టన్ సుందర్ 26 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా (9) విఫలమయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్ల లో ఆట్కిన్సన్ 5, జోష్ టంగ్ 3, క్రిస్ వోక్స్ 1 వికెట్ తీశారు. 

అనంతరం, తొలి ఇన్నింగ్స్ ఆడేందుకు బరిలో దిగిన ఇంగ్లండ్ కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్ జాక్ క్రాలే, బెన్ డకెట్ భారత బౌలర్లపై విరుచుకుపడడంతో స్కోరుబోర్డు దూసుకుపోయింది. ఈ జోడీ వైట్ బాల్ క్రికెట్ తరహాలో వేగంగా ఆడడంతో ఇంగ్లండ్ జట్టు 10 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. 

బుమ్రా గైర్హాజరీలో టీమిండియా పేస్ విభాగం కళతప్పింది. సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 92 పరుగులు. జాక్ క్రాలే 47, బెన్ డకెట్ 43 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఆతిథ్య జట్టు ఇంకా 132 పరుగులు వెనుకబడి ఉంది. 
India vs England
The Oval Test
Gus Atkinson
Zak Crawley
Ben Duckett
Indian batting collapse
England openers
Josh Tongue
Cricket

More Telugu News