Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. 100 రోజుల్లో 12 మంది ఉగ్రవాదులు హతం

Pahalgam Terror Attack 12 Terrorists Killed in 100 Days
  • 12 మంది ఉగ్రవాదుల్లో ఆరుగురు పాకిస్థాన్ ఉగ్రవాదులు
  • ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు ముమ్మరం చేసిన భద్రతా దళాలు
  • వరుస ఆపరేషన్లలో పలువురు ఉగ్రవాదులు హతం
పహల్గామ్ ఉగ్రదాడి జరిగి 100 రోజులు అవుతోంది. ఈ సమయంలో భారత భద్రతా బలగాలు 12 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. పహల్గామ్ దాడి అనంతరం భద్రతా బలగాలు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. వరుస ఆపరేషన్ల ద్వారా ఉగ్రవాదులను హతమారుస్తున్నాయి.

ఈ 100 రోజుల్లో భద్రతా బలగాలు హతమార్చిన ఉగ్రవాదుల్లో ఆరుగురు పాకిస్థానీ ఉగ్రవాదులు ఉన్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మిగిలిన ఆరుగురికి జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడులతో సంబంధం ఉందని పేర్కొన్నాయి.

పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం ఎన్ని ఆపరేషన్లు జరుగుతున్నాయో చెప్పడం కష్టమని, జమ్ము కశ్మీర్‌లోని అన్ని యూనిట్లు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. నాటి నుంచి ఆపరేషన్‌లు కొనసాగుతున్నాయి. ఇటీవల ఆపరేషన్ మహదేవ్‌లో పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు హతమయ్యారు. ఆపరేషన్ శివశక్తిలో మరో ఇద్దరు మృతి చెందారు.
Pahalgam Terror Attack
Jammu Kashmir
Indian Security Forces
Terrorists Killed
Operation Sindoor

More Telugu News