: కోనసీమలో క్షుద్ర‌పూజ‌ల కలకలం!

  • కోనసీమ జిల్లా కొత్త‌పేట మండ‌లం వాన‌ప‌ల్లి గ్రామంలో ఘ‌ట‌న‌
  • ఈ విష‌యం తెలియ‌డంతో గ్రామ‌స్థుల్లో ఆందోళ‌న
  • ఇంట్లో 30 అడుగుల గొయ్యి త‌వ్వి అందులో నాలుగు రోజులుగా క్షుద్ర‌పూజ‌లు
  • పూజ‌లు చేస్తున్న ఆరుగురిని ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించిన గ్రామ‌స్థులు
ఏపీలోని డా. బీఆర్ అంబేద్క‌ర్ కోనసీమ జిల్లా కొత్త‌పేట మండ‌లం వాన‌ప‌ల్లి గ్రామంలోని ఓ ఇంట్లో క్షుద్ర‌పూజ‌లు జరుగుతుండడం క‌ల‌క‌లం సృష్టించింది. ఈ విష‌యం తెలియ‌డంతో గ్రామ‌స్థుల్లో ఆందోళ‌న నెల‌కొంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... వాన‌ప‌ల్లి గ్రామంలోని గాంధీబొమ్మ కూడ‌లి స‌మీపంలోని ఓ ఇంట్లో 30 అడుగుల గొయ్యి త‌వ్వి అందులో గ‌త నాలుగు రోజులుగా క్షుద్ర‌పూజ‌లు చేస్తున్నారు. 

ఈ విష‌యం గ్రామ‌స్థుల‌కు తెలియడంతో అంద‌రూ ఒక్క‌సారిగా ఇంటిని చుట్టుముట్టారు. ఆ స‌మ‌యంలో ఇంట్లో పూజ‌లు చేస్తున్న ఆరుగురిని గ్రామ‌స్థులు గుర్తించి, వారిని పోలీసుల‌కు అప్ప‌గించారు. ఆ ఆరుగురిపై గురువారం ఎస్ఐ సురేంద్ర బైండోవ‌ర్ కేసు న‌మోదు చేశారు. ఈ క్షుద్ర‌పూజ‌ల వెను‌క ఉద్దేశం ఏమిటి? ఆ వ్య‌క్తులు ఎవ‌రు? ఎక్క‌డి నుంచి వ‌చ్చారు? అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

More Telugu News