ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్య‌ధికంగా 41 శాతం టారిఫ్

  • డజన్ల కొద్దీ వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలు విధించిన ట్రంప్‌
  • కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం
  • సిరియాపై అత్య‌ధికంగా 41 శాతం టారిఫ్  
  •  69 వాణిజ్య భాగస్వాములకు 10 శాతం నుంచి 41 శాతం వరకు సుంకాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వాణిజ్య ఒప్పంద గడువుకు ముందే డజన్ల కొద్దీ వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలను విధిస్తూ కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అమెరికా వ్యాపారాలకు అనుకూలంగా ప్రపంచ వాణిజ్యాన్ని పునర్నిర్మించే తన తాజా ప్రయత్నంలో భాగంగా దీనిని ఆయ‌న పేర్కొన్నారు. 69 వాణిజ్య భాగస్వాములకు 10 శాతం నుంచి 41 శాతం వరకు సుంకాలు విధించారు. ఈ సుంకాలు ఏడు రోజుల్లో అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ఉత్తర్వులో పేర్కొన్నారు.

ఇక‌, సిరియాపై అత్య‌ధికంగా 41 శాతం టారిఫ్ విధించారు. అలాగే కెనడాపై 35 శాతం, భారత్‌కు 25 శాతం, తైవాన్‌కు 20 శాతం, స్విట్జర్లాండ్‌కు 39 శాతం వరకు సుంకాలు విధించారు. 

వివిధ దేశాలు.. వాటి కొత్త టారిఫ్ జాబితా ఇదే..
  • ఆఫ్ఘనిస్థాన్- 15 శాతం
  • అల్జీరియా- 30 శాతం
  • అంగోలా- 15 శాతం
  • బంగ్లాదేశ్- 20 శాతం
  • బొలీవియా- 15 శాతం
  • బోస్నియా-హెర్జెగోవినా- 30 శాతం
  • బోట్స్ వానా- 15 శాతం
  • బ్రెజిల్- 10 శాతం
  • బ్రూనై- 25 శాతం
  • కంబోడియా- 19 శాతం
  • కామెరూన్- 15 శాతం
  • చాద్‌- 15 శాతం
  • కోస్టారికా- 15 శాతం
  • కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్-15 శాతం
  • ఈక్వెడార్- 15 శాతం
  • ఫిజీ- 15 శాతం
  • ఘనా- 15 శాతం
  • గయానా- 15 శాతం
  • ఐస్లాండ్- 15 శాతం
  • భారత్‌- 25 శాతం
  • ఇండోనేషియా- 19 శాతం
  • ఇరాక్- 35 శాతం
  • ఇజ్రాయెల్- 15 శాతం
  • జపాన్- 15 శాతం
  • జోర్డాన్- 15 శాతం
  • కజకిస్థాన్- 25 శాతం
  • లావోస్- 40 శాతం
  • లిబియా- 30 శాతం
  • మలేషియా- 19 శాతం
  • మారిషస్- 15 శాతం
  • మయన్మార్- 40 శాతం
  • మొజాంబిక్- 15 శాతం
  • నమీబియా- 15 శాతం
  • న్యూజిలాండ్- 15 శాతం
  • నైజీరియా- 15 శాతం
  • నార్వే- 15 శాతం
  • పాకిస్థాన్- 19 శాతం
  • పాపువా న్యూ గినియా- 15 శాతం
  • ఫిలిప్పీన్స్- 19 శాతం
  • సెర్బియా- 35 శాతం
  • దక్షిణాఫ్రికా- 30 శాతం
  • దక్షిణ కొరియా- 15 శాతం
  • శ్రీలంక- 20 శాతం
  • స్విట్జర్లాండ్- 39 శాతం
  • సిరియా- 41 శాతం
  • తైవాన్- 20 శాతం
  • థాయిలాండ్- 19 శాతం
  • ట్రినిడాడ్ అండ్‌ టొబాగో- 15 శాతం
  • టర్కీ- 15 శాతం
  • ఉగాండా- 15 శాతం
  • బ్రిట‌న్‌- 10 శాతం
  • వెనిజులా- 15 శాతం
  • వియత్నాం- 20 శాతం
  • జాంబియా- 15 శాతం
  • జింబాబ్వే- 15 శాతం


More Telugu News