Donald Trump: భారత్-రష్యాతో ఏ ఒప్పందం చేసుకున్నా సంబంధం లేదు: ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

Donald Trump comments on India Russia trade relations
  • ట్రూత్ సోషల్ వేదికగా భారత్, రష్యా వాణిజ్య సంబంధాలపై ట్రంప్ స్పందన
  • భారత్, రష్యా వారి ఆర్థిక వ్యవస్థను మరింత పతనం చేసుకుంటున్నాయన్న ట్రంప్
  • దిమిత్రీ ఇంకా అధ్యక్షుడ్నని అనుకుంటున్నారని ఆగ్రహం
భారత్‌తో రష్యా ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆ దేశాలు వారి ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చుకుంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ వేదికగా భారత్, రష్యా వాణిజ్య సంబంధాలపై ఆయన మరోసారి స్పందించారు.

భారత్ అత్యధిక సుంకాలు విధిస్తోందని, అందుకే న్యూఢిల్లీతో తాము చాలా తక్కువగా వ్యాపారం చేస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు. రష్యా, అమెరికా కలిసి ఎలాంటి వ్యాపారాలు చేయడం లేదని ఆయన తేల్చి చెప్పారు.

భారత్ దిగుమతులపై ట్రంప్ 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి భారీగా చమురును కొనుగోలు చేయడమే ఇందుకు కారణమని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్‌పై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తమతో వాషింగ్టన్ గేమ్ ఆడుతోందని దిమిత్రి అంటున్నారని, బహుశా తనే ఇంకా అధ్యక్షుడిగా ఉన్నానని భావిస్తున్నాడేమోనని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Donald Trump
India Russia relations
India Russia trade
US India trade
Dmitry Medvedev

More Telugu News