KCR: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.. ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం

KCR Holds Meeting with Key Leaders on MLA Defection Issue
  • ఎర్రవెల్లిలోని తన నివాసంలో సమావేశమైన ముఖ్యమంత్రి
  • మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
  • సత్యమేవ జయతే అంటూ బీఆర్ఎస్ ట్వీట్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

సత్యమేవ జయతే అంటూ బీఆర్ఎస్ ట్వీట్

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో బీఆర్ఎస్ 'ఎక్స్' వేదికగా స్పందించింది. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేసింది. తెలంగాణలో ఉప ఎన్నికలు అనివార్యం కానున్నాయని పేర్కొంది.
KCR
KCR meeting
BRS meeting
Telangana politics
MLA defection
Supreme court
KTR

More Telugu News