Kaleshwaram project: ప్రభుత్వం చేతికి కాళేశ్వరం కమిషన్ రిపోర్టు

Kaleshwaram Project Commission Report Submitted to Government
  • 15 నెలల పాటు 115 మందిని విచారించి తుది నివేదిక సిద్ధం చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్
  • నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేసిన జస్టిస్ పీసీ ఘోష్
  • సీల్డ్ కవర్ లో నివేదిక అందజేత
కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ తాజాగా తన నివేదికను సమర్పించింది. ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం 2024 మార్చి 14న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణంపై విచారణ జరిపింది.

మొత్తం 115 మందిని విచారించి సాక్ష్యాలను నమోదు చేసింది. విచారణకు సంబంధించిన తుది నివేదికను సిద్ధం చేసి తాజాగా ప్రభుత్వానికి అందజేసింది. ఈ మేరకు నివేదికను సీల్డ్ కవర్ లో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు అందజేసినట్లు అధికార వర్గాల సమాచారం.
Kaleshwaram project
Kaleshwaram commission report
Justice PC Ghose Commission
Medigadda barrage
Annaram barrage
Sundilla barrage
Telangana irrigation projects
Rahul Bojja
Telangana news
Barrage construction irregularities

More Telugu News