Prakash Raj: బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి నాకు డబ్బులు అందలేదు: ప్రకాశ్ రాజ్
- బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో ఈడీ ఎదుట హాజరైన ప్రకాశ్ రాజ్
- దాదాపు ఐదు గంటల పాటు విచారించిన ఈడీ
- బెట్టింగ్ యాప్‌లతో డబ్బులు సంపాదించాలని ఎవరూ భావించవద్దన్న ప్రకాశ్ రాజ్
- ఇక నుంచి తాను బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేయబోనని స్పష్టీకరణ
బెట్టింగ్ యాప్‌ల ప్రచారం వ్యవహారంలో తనకు నిర్వాహకుల నుంచి ఎటువంటి డబ్బులు అందలేదని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తెలిపారు. బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన కేసులో ఆయన ఈరోజు ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈడీ అధికారులు ఆయనను దాదాపు ఐదు గంటల పాటు విచారించారు.
విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బెట్టింగ్ యాప్‌లతో డబ్బులు సంపాదించవచ్చని ఎవరూ భావించవద్దని సూచించారు. ఇక నుంచి అలాంటి వాటికి తాను ప్రచారం చేయనని స్పష్టం చేశారు. ఈడీ అధికారులు తాను చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నారని చెప్పారు. తనను మరోసారి విచారణకు రావాలని ఇప్పుడైతే చెప్పలేదని అన్నారు.