‘కింగ్‌డ‌మ్‌’ రిలీజ్‌కు ముందు విజయ్ దేవరకొండ భావోద్వేగ పోస్టు

  • విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో ‘కింగ్‌డ‌మ్‌’
  • రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా
  • ఈ నేపథ్యంలో అభిమానుల‌ను ఉద్దేశించి విజ‌య్ ఎమోష‌నల్ ట్వీట్‌
రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కింగ్‌డ‌మ్‌’. ఈ మూవీ రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌ నేపథ్యంలో విజయ్ తాజాగా తన ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతాలో అభిమానుల‌ను ఉద్దేశించి ఒక భావోద్వేగపూరిత‌ పోస్టు పెట్టారు.

“సూరి (కింగ్‌డ‌మ్‌లో విజ‌య్ పాత్ర పేరు) నిండా ఆగ్రహంతో ఉన్నాడు. కానీ, అభిమానుల ప్రేమ వల్ల నేను మాత్రం ఈరోజు ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నాను. మీ అందరికీ నా ప్రేమ, కౌగిలింతలు. రేపు థియేటర్లలో కలుద్దాం” అని విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న పోస్టులో రాసుకొచ్చారు. 

కాగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ‘కింగ్‌డ‌మ్‌’కు యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ రవిచందర్ బాణీలు అందించారు. విజయ్ దేవరకొండ స‌ర‌స‌న హీరోయిన్‌గా భాగ్య‌శ్రీ బోర్సే న‌టించ‌గా... సత్యదేవ్ కీలక పాత్రలో క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాటలు సినీ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. దీంతో ‘కింగ్‌డ‌మ్‌’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


More Telugu News