Nihar Kapoor: నాన్న సూసైడ్ .. జరిగింది ఇదే: జయసుధ తనయుడు నిహార్ కపూర్!

Nihar Kapoor Interview
  • 'వీరమల్లు' గురించి మాట్లాడిన నిహార్ కపూర్
  • తల్లి సినిమాలు చూస్తానని వెల్లడి 
  • తండ్రి సూసైడ్ గురించిన ప్రస్తావన
  • విలన్ గా చేయాలని ఉందని వివరణ

జయసుధ తనయుడు నిహార్ కపూర్ నిదానంగా సినిమాలలో కుదురుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంటుగా ఆయన 'హరి హర వీరమల్లు' సినిమాలోను నటించాడు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. " హైట్ కారణంగా నేను నా 'షూ' దగ్గర నుంచి బట్టల వరకూ ఇబ్బందిపడుతూ ఉంటాను. ఇక్కడెక్కడా నా సైజ్ దొరకదు. అందువలన యూఎస్ నుంచి తెప్పిస్తూ ఉంటాను" అని అన్నాడు. 

'వీరమల్లు' సినిమాలో నా పాత్ర కొంచెం పెద్దదే. అయితే ఎడిటింగ్ లో చాలావరకూ పోయింది. సెకండ్ పార్టులో నా రోల్ కి ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నాను. అవకాశం వస్తే విలన్ గా చేయాలనుంది. ఇక అమ్మ సినిమాలు చూస్తూనే ఉంటాను. శోభన్ బాబుగారు .. చంద్రమోహన్ గారితో ఆమె చేసిన సినిమాలు నాకు ఎక్కువగా నచ్చుతాయి. నాన్నగారు ఒక బాలీవుడ్ సినిమా పని మీద చెన్నై వచ్చినప్పుడు, ఆయనకి ఇక్కడి ఇండస్ట్రీ పట్ల ఇష్టం ఏర్పడింది. దాంతో ఆయన ఇక్కడే ఉండిపోయారు" అని చెప్పాడు. 

దాసరి నారాయణరావు గారి దగ్గర నాన్నగారు పనిచేస్తున్నప్పుడు, అమ్మతో పరిచయం అయింది. నాన్నగారు ఆత్మహత్య చేసుకోవడమనేది, ఆ క్షణంలో ఆయన తీసుకున్న నిర్ణయం కాదు. అప్పటికి పది .. పదిహేనేళ్లుగా ఆయన డీప్ డిప్రెషన్ లో ఉన్నారు. కొన్ని ప్రాజెక్టులు నష్టాలు తీసుకురావడం .. మరికొన్ని ప్రాజెక్టులు ఆగిపోవడం అందుకు ఒక కారణం కావొచ్చు. తానేం చేస్తున్నది తనకే తెలియని ఒక స్థితి ఆయన ఆత్మహత్యకి దారితీసింది" అని అన్నాడు. 

Nihar Kapoor
Jayasudha
Hari Hara Veera Mallu
Tollywood
Bollywood
Suicide
Depression
Suman TV Interview
Shobhan Babu
Chandramohan

More Telugu News