Kodali Nani: కొడాలి నానితో పాటు పలువురు వైసీపీ నేతలకు ఊరట.. కేసులపై స్టే ఇచ్చిన హైకోర్టు

Kodali Nani gets relief from High Court stay on cases
  • వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానిపై మచిలీపట్నంలో కేసు నమోదు
  • ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన కొడాలి నాని
  • దర్యాప్తుపై స్టే ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానితో పాటు పలువురు వైసీపీ నేతలకు హైకోర్టులో ఊరట లభించింది. కొడాలి నానిపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలతో నానిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ నాని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణపై హైకోర్టు స్టే మంజూరు చేసింది.

అలానే వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, అప్పిరెడ్డిలకు కూడా హైకోర్టులో ఊరట లభించింది. గుంటూరు మిర్చి యార్డు పర్యటనలో ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదు చేయగా, వీరు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులపైనా హైకోర్టు స్టే ఇచ్చింది. అదే విధంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై నమోదైన కేసులో కూడా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
Kodali Nani
YS Jagan Mohan Reddy
YSRCP
Andhra Pradesh High Court
Talashila Raghuram
Appireddy
Topudurthi Prakash Reddy
Machilipatnam
Guntur Mirchi Yard
AP Politics

More Telugu News