Chandrababu Naidu: సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన... బుధవారం షెడ్యూల్ ఇదిగో!

Chandrababu Naidu Singapore Tour Wednesday Schedule
  • సింగపూర్ లో చంద్రబాబు ఐదు రోజుల పర్యటన
  • బుధవారం నాలుగో రోజు పర్యటన 
  • పలు సంస్థల ప్రతినిధులు, సింగపూర్ ప్రభుత్వ పెద్దలతో చంద్రబాబు భేటీలు 
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడంలోనూ, రాష్ట్రాభివృద్ధిలో అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం కోసం సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాల్గొవ రోజైన బుధవారం వివిధ సంస్థలు-సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు కొనసాగించనున్నారు. 

  • ఉదయం 7:30 గంటలకు క్యాపిటాలాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా) సీఈవో సంజీవ్ దాస్‌గుప్తాతో రియల్ ఎస్టేట్, అర్బన్ డెవలప్‌మెంట్, ఇండస్ట్రియల్ పార్క్‌లలో పెట్టుబడులపై చర్చిస్తారు. 
  • 8 గంటలకు మండాయ్ వైల్డ్‌లైఫ్ గ్రూప్‌ సీఈవో మైక్ బార్క్‌లేతో భేటీ కానున్నారు. ఎకో-టూరిజం, బయోడైవర్సిటీ పార్కుల అభివృద్ధి, వైల్డ్‌లైఫ్ ఎడ్యుకేషన్ మోడల్స్‌పై చర్చిస్తారు. 
  • 8:30 గంటలకు ఎస్ఎంబీసీ బ్యాంక్‌-ఇండియా డివిజన్, మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్‌తో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు గల అవకాశాలు, లిక్విడిటీ మోడల్స్‌పై చర్చిస్తారు. 
  • 9 గంటలకు టెమసెక్ కంపెనీ జాయింట్ హెడ్–పోర్ట్‌ఫోలియో డెవలప్‌మెంట్ దినేశ్ ఖన్నాతో భేటీ కానున్నారు. పబ్లిక్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్-హెల్త్ ఫండింగ్‌పై సహకారాన్ని కోరనున్నారు. 
  • 10 గంటలకు సింగపూర్ విదేశాంగ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణన్‌తో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. భారత్–సింగపూర్ సంబంధాలు, తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం అంశాలు చర్చకు రానున్నాయి. 
  • ఉదయం 11 గంటలకు నేషనల్ సెక్యూరిటీ అండ్ హోం అఫైర్స్ మంత్రి కే. షణ్ముగంతో విందు సమావేశం జరగనుంది. సెక్యూరిటీ కెపాసిటీ బిల్డింగ్, పోలీస్ ట్రైనింగ్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అంశాలు చర్చకు వస్తాయి. 
  • మధ్యాహ్నం 1:30 గంటలకు సెంబ్‌క్రాప్ సీఓఓ చార్లెస్ కోతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. రెన్యువబుల్ ఎనర్జీ, వాటర్ ట్రీట్‌మెంట్ ప్రాజెక్టులపై సహకారానికి సంబంధించి పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబు చార్లెస్ కో ముందుంచుతారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Singapore
Investment
Real Estate
Urban Development
Renewable Energy
Singapore Government
AP investments
Partnerships

More Telugu News