Talasani Srinivas Yadav: అప్పుడు అడిగితే మా వ్యూహాలు మాకు ఉన్నాయని కాంగ్రెస్ చెప్పింది: తలసాని శ్రీనివాస్ యాదవ్

Talasani Srinivas Yadav Congress Has Its Own Strategies
  • బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శ
  • బీసీ రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ, బీఆర్ఎస్‌ల పైకి నెడుతున్నారని ఆగ్రహం
  • కార్పొరేషన్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపణ
కామారెడ్డి డిక్లరేషన్‌ను ఎలా అమలు చేస్తారని అప్పుడే తాము ప్రశ్నిస్తే, తమ వ్యూహాలు తమకు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు బదులిచ్చారని బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ, బీఆర్ఎస్ మీదకు నెడుతున్నారని విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

కార్పొరేషన్ పదవుల విషయంలో బీసీలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ తరఫున రాష్ట్రపతిని కలిసి 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని కోరుతామని తెలిపారు. అధికార యంత్రాంగంలోనూ కీలకమైన స్థానాలను ఒక అగ్రవర్ణం వారికే ఇచ్చారని ఆరోపించారు. కార్పొరేషన్ పదవుల్లో బీసీలకు సగం పదవులు కేటాయించాలని ఆయన అన్నారు.
Talasani Srinivas Yadav
BRS
Congress
Kamareddy Declaration
BC Reservations
Telangana Politics

More Telugu News