Narendra Modi: ఆపరేషన్ సిందూర్‌పై అమిత్ షా ప్రసంగం.. స్పందించిన నరేంద్ర మోదీ

Narendra Modi responds to Amit Shahs speech on Operation Sindoor
  • 'ఎక్స్' వేదికగా స్పందించిన ప్రధానమంత్రి
  • ఉగ్రవాదుల ఏరివేతలో ఆపరేషన్ సిందూర్, ఆపరేషన్ మహదేవ్ కీలక పాత్ర పోషించాయని వెల్లడి
  • హోంమంత్రి అమిత్ షా వీటి గురించి పూర్తి వివరణ ఇచ్చారన్న మోదీ
ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో చేసిన ప్రసంగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'ఎక్స్' వేదికగా స్పందించారు. ఉగ్రవాదులను ఏరివేయడంలో ఆపరేషన్ సిందూర్, ఇటీవల ఆపరేషన్ మహదేవ్ కీలక పాత్ర పోషించాయని ప్రధానమంత్రి అన్నారు. వీటి గురించి హోంమంత్రి అమిత్ షా పూర్తి వివరణ ఇచ్చారని పేర్కొన్నారు.

దేశ భద్రతపై భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను ఆయన తన ప్రసంగంలో పూర్తిగా వివరించారని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు అమిత్ షా లోక్‌సభలో మాట్లాడిన గం. 1.14 నిమిషాల వీడియోను సామాజిక మాధ్యమ వేదికగా పంచుకున్నారు.

అంతకుముందు, అమిత్ షా లోక్‌సభలో ప్రతిపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం అభివృద్ధి చెందకపోవడానికి, పీవోకే ఉనికికి నెహ్రూనే కారణమని ఆరోపించారు. 1948లో భారత సైన్యం పీవోకేను చేజిక్కించుకునే స్థానంలో ఉన్నప్పటికీ అప్పటి ప్రధానమంత్రి ఏకపక్షంగా కాల్పుల విరమణను ప్రకటించడం వల్ల ఆ అవకాశం చేజారిపోయిందని వ్యాఖ్యానించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా నెహ్రూ చర్యలను వ్యతిరేకించారని గుర్తుచేశారు.
Narendra Modi
Amit Shah
Operation Sindoor
Operation Mahadev
Lok Sabha
POK
Nehru
Indian Army
Terrorists

More Telugu News