MLC Kavitha: బీసీ బిల్లు సాధ‌న కోసం మూడు రోజుల‌ దీక్ష: ఎమ్మెల్సీ క‌విత‌

MLC Kavitha 72 Hour Hunger Strike for BC Bill
  • బీసీ బిల్లు సాధ‌న కోసం ఆగ‌స్టు 4, 5, 6 తేదీల్లో 72 గంట‌లు దీక్ష చేస్తానన్న క‌విత‌
  • ఈ బిల్లు దేశానికి ఎంత అవ‌స‌ర‌మో చాటి చెప్పేందుకు దీక్ష అంటూ ప్ర‌క‌ట‌న‌
  • బీసీ బిల్లు సాధ‌న కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఒత్తిడి పెంచేందుకు దీక్ష
బీసీ బిల్లు సాధ‌న కోసం 72 గంట‌లు దీక్ష చేయ‌నున్న‌ట్లు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌విత ప్ర‌క‌టించారు. ఈ బిల్లు దేశానికి ఎంత అవ‌స‌ర‌మో చాటి చెప్పేందుకు ఆగ‌స్టు 4, 5, 6 తేదీల్లో 72 గంట‌లు దీక్ష చేయ‌నున్న‌ట్టు ఆమె తెలిపారు. ఈ రోజు హైద‌రాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో క‌విత మాట్లాడారు. 

బీసీ బిల్లు సాధ‌న కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఒత్తిడి పెంచేందుకు దీక్ష చేయ‌నున్న‌ట్టు చెప్పారు. బీసీ బిల్లు సాధ‌న విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్త‌శుద్ధి ఉంటే.. అన్ని పార్టీల‌తో వెంట‌నే అఖిల‌ప‌క్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లాల‌ని ఈ సంద‌ర్భంగా క‌విత డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో త‌ల‌పెట్టిన‌ ధ‌ర్నాను కేవ‌లం బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న డ్రామాగా ఆమె పేర్కొన్నారు. అటు, బీజేపీ నేత‌లు బీసీల‌కు అండ‌గా ఉండాల్సిన స‌మ‌యంలో త‌ప్పించుకుని తిరుగుతున్నార‌ని క‌విత దుయ్య‌బ‌ట్టారు.  


MLC Kavitha
BC Bill
Telangana Jagruthi
BC Reservations
72 Hour Deeksha
Hyderabad
Somajiguda
Bihar Elections
All Party Meeting

More Telugu News