ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు వాయిదా.. విడుదల ఎప్పుడంటే?
- తుది జాబితాను మరోసారి పరిశీలించాలని బోర్డు నిర్ణయం
- బుధవారం వెల్లడించనున్నట్లు ప్రకటించిన హోంమంత్రి అనిత
- 2022 లో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022 జనవరి 22న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ఎగ్జామ్ కు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 5,03,487 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా, 4,58,219 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40%, బీసీలకు 35%, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు.