James Cameron: అవతార్-3 ట్రైలర్ వచ్చింది ... చూశారా?... జేమ్స్ కామెరాన్ విజువల్ మాయాజాలం!
- జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో అవతార్: ఫైర్ అండ్ యాష్
- జులై 25న ‘ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ సినిమాతో పాటు థియేటర్లలో రిలీజైన ట్రైలర్
- తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న అవతార్ టీమ్
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్ వండర్ ‘అవతార్’ సిరీస్‌లో మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను జులై 25న ‘ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ సినిమాతో పాటు థియేటర్లలో ప్రదర్శించారు. పండోరా గ్రహంపై అగ్ని నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను మరోసారి మాయా లోకంలోకి తీసుకెళ్లనుంది. తాజా గా ఈ ట్రైలర్ ను అవతార్ ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బ్రిటిష్ నటి ఊనా చాప్లిన్ పోషించిన ‘వరంగ్’ పాత్రను పరిచయం చేశారు, ఇది నావి తెగలో కీలకమైన పాత్రగా ఉంటుందని తెలుస్తోంది. ట్రైలర్ అగ్ని, బూడిద థీమ్‌ను ప్రతిబింబిస్తూ, సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో సహా బహుళ భాషల్లో ఈ విజువల్ ఫీస్ట్ ప్రేక్షకులను అలరించనుంది. అవతార్ అభిమానులకు ఈ ట్రైలర్ ఒక విజువల్ ట్రీట్‌గా నిలిచి, సినిమాపై ఉత్కంఠను రెట్టింపు చేసింది.