Srushti Fertility Center: ఫెర్టిలిటీ సెంటర్ పేరిట శిశు విక్రయాలు.. మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం

Srushti Fertility Center Baby Selling Racket Sparks Outrage
  • సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారంపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం
  • మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల సంఘం
  • సరోగసీ చిన్నారుల విక్రయాన్ని తీవ్రంగా పరిగణించాలన్న మానవ హక్కుల కమిషన్
సికింద్రాబాద్‌లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారం సంచలనం రేపడంతో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించింది. సరోగసీ ద్వారా జన్మించిన చిన్నారుల విక్రయాలను తీవ్రంగా పరిగణించాలని హెచ్‌ఆర్‌సీ పేర్కొంది.

ఈ అంశంపై విచారణ జరిపి ఆగస్టు 28లోగా నివేదిక సమర్పించాలని వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది. సంతానం లేని దంపతులకు ఐవీఎఫ్, సరోగసీ ద్వారా పిల్లలు లేని లోటును తీరుస్తామని చెబుతున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ శిశు విక్రయాలు జరుపుతున్నట్లు వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశారు.
Srushti Fertility Center
Fertility center scandal
Baby selling racket
Surrogacy children

More Telugu News