ఫిడే వరల్డ్ కప్ లో చరిత్ర సృష్టించిన దివ్య దేశ్ ముఖ్... ఫైనల్లో హంపికి నిరాశ

  • ఫిడే వరల్డ్ కప్ విజేతగా మహారాష్ట్ర టీనేజర్ దివ్య దేశ్ ముఖ్
  • ఫైనల్లో టైబ్రేకర్ లో ఓటమిపాలైన హంపి
  • 75వ ఎత్తు తర్వాత ఓటమిని అంగీకరించిన తెలుగుతేజం
  • ఫిడే వరల్డ్ టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా 19 ఏళ్ల దివ్య రికార్డు  
జార్జియాలో జరిగిన ఫిడే చెస్ వరల్డ్ కప్ లో తెలుగుతేజం కోనేరు హంపికి నిరాశ ఎదురైంది. కోనేరు హంపి, దివ్య దేశ్ ముఖ్ మధ్య జరిగిన ఫైనల్లో తొలి రెండు గేములు డ్రాగా ముగియడంతో, విజేతను నిర్ణయించేందుకు టైబ్రేకర్ నిర్వహించారు. టైబ్రేకర్ పోరులో హంపి ఓటమిపాలైంది. మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల అమ్మాయి దివ్య దేశ్ ముఖ్ విజేతగా నిలిచింది. తద్వారా, ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ లో విజేతగా నిలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.

ఇప్పటివరకు ఇంటర్నేషనల్ మాస్టర్ గా ఉన్న దివ్య ఈ విజయంతో గ్రాండ్ మాస్టర్ హోదా పొందింది. నేటి టైబ్రేకర్ పోరులో 75వ ఎత్తు అనంతరం కోనేరు హంపి ఓటమిని అంగీకరించింది. 


More Telugu News