Palla Srinivasa Rao: ఇప్పటికీ జగన్ మారలేదు... కంపెనీలు రాకుండా అడ్డుకుంటున్నారు: పల్లా శ్రీనివాసరావు

Palla Srinivasa Rao Criticizes Jagan for Obstructing Company Investments
  • వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారన్న పల్లా
  • పిల్ల సైకోల తీరు శ్రుతి మించుతోందని ఆగ్రహం
  • ప్రజలు చెప్పినా వీళ్ల బుద్ధి మారడంలేదని విమర్శలు
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. తన ఐదేళ్ల పాలనలో ఏపీ భవిష్యత్తును నాశనం చేసిన జగన్... ఇప్పుడు రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలు రాకుండా అడ్డుకుంటున్నాడని మండిపడ్డారు. టీసీఎస్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు రాష్ట్రానికి వస్తుంటే, వాటిని అడ్డుకునేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పిల్ల సైకోల దుష్ప్రచారం శ్రుతి మించుతోందని అన్నారు. 

తమ కుంభకోణాల భాగోతాలను కప్పిపుచ్చుకోవడం వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమం చేపట్టారని పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు చెప్పినా వీళ్ల బుద్ధి మారడం లేదని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి-సంక్షేమం చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.
Palla Srinivasa Rao
Jagan Mohan Reddy
Andhra Pradesh
TDP
YSRCP
TCS
Google
Cognizant
AP Development
AP Politics

More Telugu News