బ్యాంకాక్‌లో కాల్పులు... ఐదుగురు మృతి, ఆత్మహత్య చేసుకున్న దుండగుడు

  • ఓర్ టు కో మార్కెట్‌లోకి జొరబడి కాల్పులు జరిపిన దుండగుడు
  • నలుగురు సెక్యూరిటీ గార్డులు, ఒక మహిళ మృతి
  • తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న దుండగుడు
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా, అనంతరం అతడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన చతుచక్ మార్కెట్ సమీపంలో చోటు చేసుకుంది. ఓర్ టు కో మార్కెట్‌లోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులు జరపడంతో నలుగురు సెక్యూరిటీ గార్డులు, ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు.

బ్యాంకాక్‌లో కాల్పుల ఘటన నేపథ్యంలో ప్రజలు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గత కొన్నేళ్లుగా బ్యాంకాక్‌లో దాడులు పెరుగుతున్నాయని తెలుస్తోంది. దాదాపు రెండు నెలల క్రితం థాంగ్ జిల్లాలోని ఒక పాఠశాల సమీపంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందడం గమనార్హం.


More Telugu News