Vijayawada Metro: విజయవాడ మెట్రోకు టెండర్లకు ఆహ్వానం

Vijayawada Metro Tenders Invited for Rail Project
  • ఏపీలోనూ మెట్రో కూత
  • ఇప్పటికే విశాఖలో మెట్రోకు టెండర్లకు ఆహ్వానం
  • తాజాగా విజయవాడలోనూ ఈపీసీ విధానంలో టెండర్లు
ఇక ఏపీలోనూ మెట్రో రైలు కూత వినిపించనుంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో రైలు వ్యవస్థల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే విశాఖ మెట్రోకు టెండర్లు పిలవగా... తాజాగా, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం టెండర్లు ఆహ్వానించారు. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ మేరకు ఈపీసీ విధానంలో టెండర్లకు ఆహ్వానం పలికింది.

ఇందులో భాగంగా 32 మెట్రో స్టేషన్లు, ఒక అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ నిర్మించనున్నారు. విజయవాడ మెట్రో తొలి దశలో రెండు కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నారు. కారిడార్-1లో భాగంగా నెహ్రూ బస్టాండ్  నుంచి గన్నవరం బస్టాండ్ వరకు పనులు చేపడతారు. కారిడార్-1లో 4.7 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. కారిడార్-2లో బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు నిర్మాణం చేపడతారు. 

తొలి దశలో భాగంగా మొత్తం 38.4 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం జరగనుంది. 
Vijayawada Metro
AP Metro Rail Corporation
Vijayawada
Visakhapatnam
Metro Rail Project
Andhra Pradesh Metro
Gannavaram
Penamaluru
Nehru Bus Stand
EPC Tender

More Telugu News