Rakul Preet Singh: దేశంలో పనికిమాలిన వాళ్లు ఎక్కువైపోయారు.. రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh slams social media trolls
  • సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లపై మండిపడ్డ నటి
  • పనీపాట లేక సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఫైర్
  • కొంతమందికి ఇతరులను బాధపెట్టడమే పని అంటూ విమర్శ 
సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు చేసే వారిపై నటి రకుల్ ప్రీత్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో పనికిమాలిన వాళ్లు ఎక్కువైపోయారని, ఇతరులను బాధపెట్టడం తప్ప వారికి పనేమీ లేదని విమర్శించారు. ‘పనీపాట లేకపోవడం, ఫ్రీ డేటా కారణంగా కొంతమంది సోషల్ మీడియాలో నెగెటివిటీని వ్యాపింపజేస్తున్నారు. ఇతరులపై కామెంట్లు పెడుతూ సంతోషిస్తున్నారు. సెలెబ్రెటీల వ్యక్తిగత జీవితాలపై దుష్ప్రచారం చేయడం, వారిని వ్యక్తిగతంగా బాధపెట్టడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. వారికి ఇంతకంటే వేరే పనేమీ లేకుండా పోయింది. మన దేశంలో పనికిమాలిన వాళ్ళు ఎక్కువయ్యారు’ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా పోస్ట్ పెట్టారు. 

ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది రకుల్ కు మద్దతుగా కామెంట్లు పెడుతుండగా మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. కాగా, టాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన రకుల్ ప్రీత్ సింగ్ వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. ఇటీవల రకుల్ నటించిన ‘మేరే హస్సెండ్ కి బివి’ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా రకుల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటోంది. తనను ట్రోల్ చేస్తున్న వారికి కౌంటర్లు ఇస్తూ బిజీబిజీగా గడుపుతోంది.


Rakul Preet Singh
Rakul Preet
social media trolls
negative comments
celebrity trolling
mere husband ki biwi
rakul preet singh wedding
tollywood actress
rakul preet singh movies
rakul preet singh husband

More Telugu News