Chandrababu Naidu: సింగపూర్‌లో తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి అనూహ్య స్పందన... ఫొటోలు ఇవిగో!

Chandrababu Naidu Attends Telugu Diaspora Event in Singapore
  • సింగపూర్ లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు బృందం
  • తెలుగు డయాస్పొరాతో సమావేశం
  • సింగపూర్ తో పాటు, పొరుగున ఉన్న ఐదు దేశాల నుంచి తెలుగువారి రాక
  • 2,500 మందితో చంద్రబాబు ఫొటో సెషన్
సింగపూర్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమం విజయవంతమైంది. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ హాజరైన ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. సింగపూర్‌తో పాటు సమీపంలోని ఐదు దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు, ఎన్ఆర్ఐలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాకముందే ప్రధాన ఆడిటోరియం తెలుగువారితో నిండిపోయింది. దీంతో అనుబంధ ఆడిటోరియంకు కూడా సభికులను తరలించాల్సి వచ్చింది.

సుమారు ఐదు గంటల పాటు అత్యంత ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు తమ భార్యాపిల్లలు, స్నేహితులతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం దాదాపు 2,500 మందితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో సెషన్ నిర్వహించారు. రెండున్నర గంటల పాటు ఓపికగా నిలబడి, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగారు. మంత్రి నారా లోకేశ్ కూడా వేదికపైనే ఉండి ప్రతి కుటుంబం ఫోటోలు దిగేలా సహకరించారు.

ఈ సందర్భంగా తెలుగువారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి తమ అభిప్రాయాలను, సమస్యలను పంచుకున్నారు. పిల్లలతో తెలుగు డయాస్పోరాకు హాజరైన మహిళలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.

Chandrababu Naidu
Telugu Diaspora Singapore
Nara Lokesh
Singapore Telugu community
AP CM
Telugu NRIs
South East Asia
Telugu people
Singapore event
Telugu Association

More Telugu News