మరోసారి ఒకే వేదికపైకి థాకరే బ్రదర్స్!
- 2005లో విడిపోయిన ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే
- ఇటీవలే త్రిభాషా సూత్ర వ్యతిరేక కార్యక్రమంలో కలుసుకున్న సోదరులు
- ఇవాళ ఉద్ధవ్ థాకరే పుట్టినరోజు సందర్భంగా మరోసారి భేటీ
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరని చెబుతుంటారు. అది నిజమేనని మరోసారి రుజువైంది. 2005లో విడిపోయాక ఇటీవలి వరకు ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకున్న థాకరే బ్రదర్స్ మళ్లీ ఒక్కటయ్యారు!
దాదాపు 20 ఏళ్ల తర్వాత ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే ఇటీవల ఒకే వేదికను పంచుకున్నారు. మహారాష్ట్ర సర్కారు త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఈ అన్నదమ్ములిద్దరూ హాజరయ్యారు. ఇవాళ ఉద్ధవ్ థాకరే పుట్టినరోజు సందర్భంగా మాతోశ్రీ నివాసంలో వీరిద్దరూ మరోసారి భేటీ అయ్యారు. దివంగత బాల్ థాకరే కుర్చీకి నమస్కరించి, నివాళులు అర్పించారు. అనంతరం బాల్ థాకరే చిత్రం పటం ముందు నిల్చుని ఫొటోలకు పోజులిచ్చారు. తన సోదరుడు ఉద్ధవ్ థాకరేకు రాజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపేశారు.
వీరి కలయికతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. శివసేన యూబీటీ వర్గానికి ఉద్ధవ్ థాకరే నాయకత్వం వహిస్తుండగా... మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీకి రాజ్ థాకరే అధ్యక్షుడిగా ఉన్నారు.