నువ్వు మామూలోడివి కాదు: విజయ్ దేవరకొండపై రష్మిక ప్రశంసల జల్లు

  • నిన్న రిలీజైన కింగ్‌డమ్ ట్రైలర్
  • సోషల్ మీడియాలో స్పందించిన రష్మిక మందన్న
  • నేను నీలా 50 శాతం నటించగలిగినా బాగుండు అంటూ రష్మిక పోస్టు
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కింగ్‌డమ్. ఈ చిత్రం జులై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై విజయ్ సన్నిహితురాలు రష్మిక మందన్న స్పందించారు. నిన్న రిలీజైన కింగ్‌డమ్ ట్రైలర్ చూశాక తన అభిప్రాయాలను పంచుకున్నారు. 

తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆమె "నువ్వు నిజంగా అద్భుతం. నేను నీలా 50 శాతం నటించగలిగితే బాగుండు... ఈ ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని నాలుగు రోజుల నుంచి వెయిటింగ్.... నేనెప్పుడూ చెబుతుంటాను... నువ్వు మామూలోడివి కాదని" అంటూ విజయ్ అభినయాన్ని ఉద్వేగభరితంగా పొగిడారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, ఆయన విజన్, మరియు కథను చెప్పిన విధానంపై రష్మిక ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ట్రైలర్‌కు ప్రాణం పోసిందని తెలిపారు. ఈ సినిమా కోసం తాను ఆతృతగా ఎదురుచూస్తున్నానని రష్మిక వెల్లడించారు. అలాగే, చిత్ర బృందం మొత్తానికి, ముఖ్యంగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు.  

రష్మిక వ్యాఖ్యలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. విజయ్ దేవరకొండ-రష్మిక మధ్య అనుబంధం ఉందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో, రష్మిక వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కింగ్‌డమ్ చిత్రానికి తన వ్యాఖ్యల ద్వారా రష్మిక ప్రమోషన్ చేస్తున్నట్టుందని నెటిజన్లు అంటున్నారు.


More Telugu News