సింగపూర్ చేరుకున్న మంత్రి లోకేశ్‌కు తెలుగు ప్ర‌జ‌ల ఘ‌న స్వాగ‌తం

  • సీఎం చంద్రబాబుతో కలిసి ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు సింగపూర్ పర్యటన 
  • రాష్ట్రానికి పెట్టుబడులు, బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పై  మంత్రి లోకేశ్‌ సింగపూర్ పర్యటన  
  • ఈ రోజు మధ్యాహ్నం తెలుగు డయాస్పోరాతో సమావేశం 
ఐటీ, విద్య శాఖల‌ మంత్రి నారా లోకేశ్‌ సింగపూర్ చేరుకున్నారు. ఆయనకు స్థానిక తెలుగు ప్రజలు పుష్పగుచ్ఛాలతో ఘ‌న‌ స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబుతో కలిసి ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు సింగపూర్ లో వేర్వేరు కార్యక్రమాలకు మంత్రి లోకేశ్‌ హాజరు కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పై  మంత్రి లోకేశ్‌ సింగపూర్ పర్యటన కొన‌సాగ‌నుంది. ఈ రోజు మధ్యాహ్నం తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎంతో క‌లిసి మంత్రులు పాల్గొననున్నారు.  


More Telugu News