KTR: పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న కేటీఆర్... భద్రతా సిబ్బందిని వారించిన పాడి కౌశిక్ రెడ్డి!

KTR Slaps Party Worker Intervention by Padi Kaushik Reddy
  • ఉప్పల్‌లో తెలంగాణ విద్యార్థి విభాగం సదస్సుకు హాజరైన కేటీఆర్
  • తన ముందు నడుస్తున్న కార్యకర్తను చేయితో నెట్టిన కేటీఆర్
  • నాయకులు, సెక్యూరిటీ చేయి చేసుకుంటే వారించిన కౌశిక్ రెడ్డి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ అనుబంధ విభాగం బీఆర్ఎస్‌వీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు! ఈ రోజు ఉప్పల్‌లో తెలంగాణ రాష్ట్ర స్థాయి తెలంగాణ విద్యార్థి విభాగం సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి వేదికపైకి నడుచుకుంటూ వెళుతుండగా ఒక కార్యకర్త ఆయనకు ఎదురుగా వచ్చారు.

అయితే, అక్కడ ఏం జరిగిందో స్పష్టంగా తెలియదు కానీ, కేటీఆర్ తన ముందున్న కార్యకర్త తలపై చేయితో పక్కకు నెట్టేశారు. ఆ తర్వాత పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా అతడిని పక్కకు లాగారు. కౌశిక్ రెడ్డి, ఇతర నాయకులు అతడిని అక్కడి నుంచి దూరంగా పంపించే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది అతడిని నెట్టివేస్తుండగా కౌశిక్ రెడ్డి వారించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
KTR
KTR
BRS
BRSV
Telangana
Padi Kaushik Reddy
Uppal
Telangana student wing

More Telugu News