Kargil Vijay Diwas: కార్గిల్ విజయ్ దివస్ .. అమరవీరులకు వాయుసేన నివాళులు

Indian Air Force Salutes Kargil War Heroes on Vijay Diwas
  • కార్గిల్ విజయ్ దివస్ జరిగి సరిగ్గా ఈరోజుకు 26 ఏళ్లు
  • కార్గిల్ యుద్దం నాటి చిత్రాలతో ప్రత్యేక వీడియోను రూపొందించిన భారత వాయుసేన 
  • వీడియోను ఎక్స్ లో పోస్టు చేసిన వాయుసేన
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు భారత వాయుసేన ఘనంగా నివాళులర్పించింది. కార్గిల్ యుద్ధం నాటి చిత్రాలతో ప్రత్యేక వీడియోను రూపొందించింది. ఆ వీడియోను వాయుసేన తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకుంది. అమరవీరుల ధైర్యం, త్యాగం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొంది.

1999 మే – జులై మధ్య భారత్, పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ముజాహిదీన్ల ముసుగులో నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన శత్రు సైన్యాలు కార్గిల్‌లో ఖాళీగా ఉన్న కీలక స్థావరాలను వశం చేసుకున్నాయి. వీరి ఆక్రమణను తెలుసుకున్న భారత సైన్యం 'ఆపరేషన్ విజయ్'ను ప్రారంభించింది.

భారత సైన్యం ఎదురుదాడికి పాక్ సైన్యం బెంబేలెత్తి తోకముడిచి పారిపోయింది. పాక్ సైన్యాన్ని తరిమికొట్టినట్లు జులై 26న భారత సైన్యం ప్రకటించింది. ఇది జరిగి నేటికి సరిగ్గా 26 ఏళ్లు పూర్తయింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జులై 26న కార్గిల్ విజయ్ దివస్‌ను నిర్వహించుకుంటూ అమరవీరులకు నివాళులర్పిస్తున్నారు. 
Kargil Vijay Diwas
Kargil War
Indian Air Force
Operation Vijay
India Pakistan War
Kargil War Heroes
Indian Army
Air Force Tribute
War Memorial
Kargil Victory

More Telugu News