ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ఫొటో.. ఎగిరి గంతేసిన న‌టి.. ఇదిగో వీడియో!

   
ప‌వ‌ర్ స్టార్‌ పవన్ క‌ల్యాణ్ హీరోగా క్రిష్ జాగ‌ర్ల‌మూడి, జ్యోతికృష్ణ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన 'హరిహర వీరమల్లు' నిన్న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన‌ విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి చిత్ర బృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. అయితే, ఈ స‌క్సెస్ మీట్‌లో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. 

న‌టి నివిత సినిమాలో బాగా న‌టించార‌ని ప‌వ‌న్ ప్ర‌శంసించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌తో ఫొటో దిగాల‌ని ఉంద‌ని నివిత కోరారు. దాంతో వెంట‌నే వేదిక‌పైకి ర‌మ్మ‌ని ప‌వ‌ర్ స్టార్ ఆహ్వానించారు. ఇక‌, స్టేజీపైకి ఎక్కి ప‌వ‌న్‌తో ఫొటో దిగిన నివిత ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. ఆనందంతో అక్క‌డే గంతులేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ గురించి నివిత మాట్లాడుతూ... పవన్ గారు చాలా సింపుల్, స్వీట్ పర్సన్. వెంకటేశ్వర స్వామిలా, ‘మ్యాన్ ఆఫ్ గాడ్’ లా ఉంటారు. షూటింగ్ స‌మ‌యంలో చాలా స్ట్రెస్ గా కనిపించారని.. రాజకీయాల వల్ల ఫుల్ బిజీగా ఉన్నారని పేర్కొన్నారు. మొత్తానికి ప‌వ‌న్ దృష్టిలో ప‌డ్డ ఈ అమ్మ‌డు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.


More Telugu News