Muhammad Yunus: బంగ్లాదేశ్‌లోనూ తాలిబన్ రాజ్యం.. మహిళల దుస్తులపై ఆంక్షలు

Muhammad Yunus Government Faces Criticism Over Dress Code in Bangladesh
  • మహిళల దుస్తులు, ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలపై యూనస్ ప్రభుత్వం ఆంక్షలు
  • దేశవ్యాప్తంగా పెల్లుబికిన ఆగ్రహావేశాలు
  • తాలిబన్ పాలనతో పోలుస్తూ నిరసనలు
  • దిగొచ్చిన ప్రభుత్వం ఆంక్షల ఉపసంహరణ
నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీవ్ర వివాదంలో చిక్కుకుంది. మహిళల దుస్తులపై ఆంక్షలు విధించడం, ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలను నిషేధిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌లే ఇందుకు కారణం. ఈ పరిణామాలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శకు దారితీశాయి. కొందరు దీనిని ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబాన్ పాలనతో పోల్చారు.

ఈ వారం ప్రారంభంలో బంగ్లాదేశ్ బ్యాంక్ (సెంట్రల్ బ్యాంక్) తన మహిళా ఉద్యోగులు పొట్టి దుస్తులు, స్లీవ్ లెస్ దుస్తులు, లెగ్గింగ్స్ ధరించకుండా నిషేధించింది. శరీరమంతా కప్పే సంప్రదాయ దుస్తులైన చీరలు, లేదా సల్వార్ కమీజ్‌లను ధరించాలని ఆదేశించింది. అదనంగా, మహిళలు హెడ్‌స్కార్ఫ్ లేదా హిజాబ్ ధరించాలని, ఫార్మల్ షూస్ లేదా శాండల్స్ ఉపయోగించాలని సూచించింది. పురుష ఉద్యోగులు జీన్స్, చినో ట్రౌజర్స్ ధరించడంపై నిషేధం విధించారు. ఈ ఆదేశాలను పాటించని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్‌ఆర్ విభాగం హెచ్చరించింది.

ఈ ఆంక్షలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. పౌరులు, జర్నలిస్టులు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ‘డిక్టేటర్‌షిప్’ అని ఆరోపించారు. కొందరు ఈ ఆదేశాలను ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు జారీ చేసిన శాసనాలతో పోల్చారు. ‘ముహమ్మద్ యూనస్ పాలనలో కొత్త తాలిబానీ యుగం’ అని ఒక యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఉద్ధృతమైన విమర్శల నేపథ్యంలో బంగ్లాదేశ్ బ్యాంక్ గురువారం ఈ ఆదేశాన్ని ఉపసంహరించుకుంది. 
Muhammad Yunus
Bangladesh
Bangladesh Bank
Taliban
dress code
women rights
social media
controversy
Nobel laureate
garment restrictions

More Telugu News