Neil Haworth: రూ.5 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కాళ్లను తొలగించుకున్న వైద్యుడు

Neil Haworth UK doctor removes legs for insurance money
  • బ్రిటన్‌లో వెలుగు చూసిన దారుణం
  • హాని కలగకుండా కాళ్లను తొలగించుకోవడంపై వీడియోలను కొనుగోలు చేసిన నెయిల్
  • ఆ తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం
  • కోర్టుకు వెళ్లిన ఇన్సూరెన్స్ సంస్థలు
బ్రిటన్‌లో బీమా సొమ్ము కోసం ఓ వైద్యుడు తన కాళ్లను తొలగించుకున్నాడు. 5 లక్షల పౌండ్లు వస్తాయన్న ఆశతో ఆయన రెండు మోకాళ్ల కింది భాుగాన్ని  తొలగించుకున్నాడు. భారతీయ కరెన్సీలో ఈ బీమా విలువ రూ.5.4 కోట్లు. దీనిపై బీమా సంస్థలు కోర్టును ఆశ్రయించాయి.

నెయిల్ హావర్ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే తన రెండు మోకాళ్లను తొలగించుకున్నాడని బీమా సంస్థలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది.

బీమా డబ్బుల కోసం ఇతరుల కాళ్లను కూడా తొలగించేలా మారియస్ గుత్సావ్‌సన్ అనే వైద్యుడిని నెయిల్ ప్రోత్సహించారనే అభియోగాలు వచ్చాయి. దీంతో అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

శరీరానికి హాని కలగకుండా మోకాళ్లను ఎలా తొలగించుకోవచ్చనే దానిపై నెయిల్ ఒక వెబ్‌సైట్ నుంచి కొన్ని వీడియోలను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వాటి ఆధారంగా మరో వైద్యుడి సహకారంతో తన రెండు కాళ్లను తొలగించుకున్నాడు. ఆ తర్వాత బీమా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

తనకు రక్తనాళాల సమస్య ఉందని, మోకాళ్లను తొలగించుకోకపోతే అది శరీరమంతా వ్యాపిస్తుందని బీమా సంస్థలను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, ముందుగా సమాచారం ఇవ్వలేదనే కారణంతో బీమా సంస్థలు అతని క్లెయిమ్‌లను తిరస్కరించాయి. అదే సమయంలో మారియస్ గుత్సావ్‌సన్ వ్యవహారం కూడా వెలుగులోకి రావడంతో పోలీసులు నెయిల్‌ను అరెస్టు చేశారు.

అయితే, ఇటీవల ఒక అంతర్జాతీయ మీడియాతో నెయిల్ మాట్లాడుతూ, తన అనారోగ్యం కారణంగానే కాళ్లు తొలగించుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. వైద్య నిపుణుల సూచన మేరకు ఆపరేషన్ చేయించుకున్నట్లు తెలిపాడు. కాళ్లు ఉన్నప్పటి కంటే కోల్పోయిన తర్వాతనే తన జీవితం బాగుందని ఆయన పేర్కొన్నారు.
Neil Haworth
insurance fraud
leg amputation
Marius Gutauskas
medical ethics
UK doctor

More Telugu News