Narendra Modi: బ్రిటన్ ప్రధాని ప్రసంగం సమయంలో ఇబ్బందిపడిన హిందీ ట్రాన్స్ లేటర్.. మోదీ ఏమన్నారంటే?
- చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న బ్రిటన్-భారత్
- ఇరుదేశాల నేతల ఉమ్మడి సమావేశంలో మాట్లాడిన కీర్ స్మార్టర్
- ఇబ్బందిపడిన హిందీ ట్రాన్స్ లేటర్.. క్షమాపణలు
- పర్వాలేదు, ఇంగ్లీష్ పదాలు ఉపయోగించవచ్చన్న నరేంద్ర మోదీ
- చిరునవ్వులు చిందించిన బ్రిటన్ ప్రధాని
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆంగ్ల ప్రసంగాన్ని హిందీలోకి అనువదిస్తున్న అనువాదకురాలు కాస్త ఇబ్బంది పడ్డారు. ఇది గమనించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, అక్కడక్కడ ఆంగ్ల పదాలను ఉపయోగించవచ్చని సూచించారు.
బ్రిటన్ పర్యటనలో ఉన్న నరేంద్ర మోదీ ఆ దేశంతో చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సంతకాల సేకరణ అనంతరం ఇరుదేశాల నేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
కీర్ స్టార్మర్ ప్రసంగిస్తుండగా హిందీ అనువాదకురాలు అక్కడక్కడ ఇబ్బంది పడ్డారు. జరిగిన దానికి ఆమె క్షమాపణలు చెప్పారు. పర్వాలేదని, అక్కడక్కడ ఆంగ్ల పదాలు ఉపయోగించవచ్చని మోదీ ఆమెకు చెప్పారు. ఇదంతా గమనించిన కీర్ స్టార్మర్ చిరునవ్వులు చిందించారు.
రెండు దేశాల పర్యటనలో భాగంగా మోదీ ప్రస్తుతం బ్రిటన్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా స్వేచ్ఛా వాణిజ్యంపై ఇరు దేశాల వాణిజ్య శాఖ మంత్రులు సంతకాలు చేశారు. భారత్ - బ్రిటన్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతో పాటు ఇరుదేశాల మధ్య ప్రతి సంవత్సరం 34 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని అంచనాలు ఉన్నాయి.