Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' సినిమా చూసిన 'పరదా' మహిళలు... వీడియో ఇదిగో!

Hari Hara Veera Mallu Movie Watched by Parada Women
  • నేడు హరిహర వీరమల్లు రిలీజ్
  • ప్రసాద్స్ ఐమ్యాక్స్ లో సందడి చేసిన పరదా మహిళలు
  • ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో అనుపమ లీడ్ రోల్ లో పరదా చిత్రం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం హరిహర వీరమల్లు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, హైదరాబాదులోని ప్రసాద్స్ ఐమ్యాక్స్ లోనూ హరిహర వీరమల్లు చిత్రం ప్రదర్శిస్తుండగా, ఎర్రటి చీరలు కట్టుకుని, ముఖం కనపించకుండా 'పరదా'లతో కప్పుకుని కొందరు మహిళలు థియేటర్ కు వచ్చారు. దాంతో అందరి దృష్టి ఆ 'పరదా' మహిళలపై పడింది. ఆ మహిళలు కూడా హరి హర వీరమల్లు చిత్రం వీక్షించారు. 

అసలు విషయం ఏమిటంటే... ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ ప్రధానపాత్రలో పరదా అని చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ఆగస్టు 22న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో, నేడు హరిహర వీరమల్లు రిలీజ్ రోజున 'పరదా' చిత్రబృందం ప్రమోషన్లు చేపట్టింది. ఎర్రటి చీరలు ధరించి, ముఖాన్ని చీర చెంగులతో కప్పుకుని ఉన్న కొందరు మహిళలను ప్రసాద్స్ ఐమ్యాక్స్ కు పంపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. 'పరదా' చిత్రం సమాజంలో స్త్రీలపై వివక్ష, సమానత్వం ఆధారంగా రూపుదిద్దుకుంటోంది.
Hari Hara Veera Mallu
Pawan Kalyan
Parada Movie
Anupama Parameswaran
Praveen Kandregula
Prasads Imax Hyderabad
Telugu Cinema Promotion
Women Empowerment Movie
Social Discrimination
August 22 Release

More Telugu News