Russia plane crash: రష్యా విమానం కూలిపోయింది.. శకలాలు గుర్తింపు.. వీడియో ఇదిగో!

Russia Plane Crash All 49 Feared Dead
  • ప్రమాద సమయంలో ఐదుగురు చిన్నారులు సహా 49 మంది
  • ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడినట్లు తెలియలేదన్న అధికారులు
  • ఘటనా స్థలంలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు
రష్యాలో ప్రయాణికుల విమానం ఒకటి కూలిపోయింది. ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ కుదరకపోవడంతో పైలట్లు చుట్టూ తిరిగి మరోమారు ప్రయత్నించే క్రమంలో విమానం కూలిపోయినట్లు సమాచారం. తొలుత ఈ విమానానికి సంబంధించి మిస్సింగ్ ప్రకటన చేసిన అధికారులు.. కాసేపటికే విమానం కూలిపోయిందని వెల్లడించారు. గాలింపు చర్యలు చేపట్టిన ఎమర్జెన్సీ టీమ్ ఈ విమాన శకలాలను గుర్తించిందని తెలిపారు. ఎయిర్ పోర్టుకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు. ఘటనా స్థలంలో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయని, ప్రమాద తీవ్రతను గమనిస్తే ప్రయాణికులలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని చెప్పారు.

అంగారా ఎయిర్‌లైన్‌కు చెందిన ఏఎన్‌-24 విమానం గురువారం ఉదయం బ్లాగోవెష్‌చెన్స్క్‌ నుంచి చైనా సరిహద్దుల్లో ఉన్న టిండా ప్రాంతానికి బయల్దేరింది. ఇందులో ఐదుగురు చిన్నారులతో పాటు మొత్తం 49 మంది ప్రయాణికులు ఉన్నారు. టిండాలోని ఎయిర్ పోర్టులో పైలట్ ల్యాండింగ్ కు ప్రయత్నించి విఫలమయ్యారని సమాచారం. ఎయిర్ పోర్ట్ చుట్టూ తిరిగి మరోమారు ల్యాండింగ్ కు పైలట్ ప్రయత్నించారని, ఈ క్రమంలోనే ఎయిర్ పోర్టుకు 15 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయిందని అధికారులు తెలిపారు.
Russia plane crash
AN-24 crash
Angara Airlines
plane crash Russia
Blagoveshchensk
Tinda
Russian plane crash video
aviation accident
China border

More Telugu News