Diabetes: మధుమేహాన్ని మందులతో పనిలేకుండా నియంత్రించే 10 –10 – 10 రూల్

Diabetes 10 10 10 Rule Controls Blood Sugar Without Medication
  • మూడు పూటలా నడక అలవాటు చేసుకోవాలంటున్న నిపుణులు
  • బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ తర్వాత పది నిమిషాల నడకతో డయాబెటిస్ నియంత్రణ
  • ఆహారం తీసుకున్నాక 15 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలని సూచన
మధుమేహ బాధితులు రెగ్యులర్ గా రక్తంలో చక్కెర స్థాయులను చెక్ చేసుకుంటూ మందులు వాడాల్సి ఉంటుందనేది తెలిసిందే. షుగర్ లెవల్స్ పెరిగిన ప్రతిసారీ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడం తప్పనిసరి. ఇది కొంత బాధాకరమే అయినా ప్రత్యామ్నాయం లేక ఇబ్బంది పడుతుంటారు. అయితే, ఇకపై ఇలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే షుగర్ లెవల్స్ ను నియంత్రించే మార్గం ఉందంటున్నారు. అదే 10 – 10 – 10 రూల్. ఈ పద్ధతిని పాటిస్తే ఇన్సులిన్ ఇంజెక్షన్లతో ఇబ్బంది పడాల్సిన అవసరం దాదాపుగా తగ్గిపోతుందని చెబుతున్నారు.

ఇన్సులిన్ ఇంజెక్షన్లు..
సాధారణంగా ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరగడం మొదలవుతుంది. శరీరంలోని ఇన్సులిన్ దీనిని నియంత్రిస్తుంది. ఇది శరీరంలో సహజంగా జరిగే ప్రక్రియ. అయితే, మధుమేహ బాధితులలో సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి కాక ఈ ప్రక్రియ మందగిస్తుంది. దీంతో రక్తనాళాలు, నరాలు, ఇతర కీలక అవయవాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ ముప్పును తప్పించేందుకు మధుమేహ బాధితులు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటుంటారు.

ఏమిటీ 10 – 10 – 10 రూల్?
ఉదయం బ్రేక్ ఫాస్ట్ ముగించిన తర్వాత 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చి పది నిమిషాలు నడవాలి. ఓ వెయ్యి అడుగులు లక్ష్యంగా పెట్టుకుని నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్ మాట్లాడుతూనో, పెంపుడు జంతువులను వాకింగ్ కు తీసుకెళ్లడమో.. ఇలా ఏదో ఓ వ్యాపకం పెట్టుకుని పది నిమిషాలు నడవాలని చెబుతున్నారు. ఇదే పద్ధతిని మధ్యాహ్న భోజనం తర్వాత, రాత్రి డిన్నర్ తర్వాత కూడా అనుసరించాలని తెలిపారు. ఇదే 10 – 10 –10 రూల్. దీనివల్ల శరీరంలోని కండరాలపై ఒత్తిడి పెరిగి గ్లూకోజ్ ను మరింత ఎక్కువగా గ్రహిస్తాయని చెప్పారు. దీంతో రక్తంలో చక్కెర స్థాయులు ఆటోమేటిక్ గా నియంత్రణలో ఉంటాయని వివరించారు. ఇలా ఆహారం తీసుకున్నాక నడక అలవాటు చేసుకుంటే కొంతకాలం తర్వాత ఇన్సులిన్ ఇంజెక్షన్ల అవసరం ఉండదని చెప్పారు. పైగా నడకతో ఇతర ప్రయోజనాలు ఎటూ ఉండనే ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం. నడక మొదలుపెట్టండి. వైద్యుల సూచన తీసుకోవడం తప్పనిసరి.
Diabetes
Blood Sugar
Insulin
10-10-10 Rule
Walking
Glucose Levels
Health
Exercise
Sugar Control
Diabetes Management

More Telugu News