YS Sunitha: ముఖ్యమంత్రి చంద్రబాబుతో వైఎస్ సునీత భేటీ

YS Sunitha Meets CM Chandrababu Seeking Justice for Fathers Murder
  • 2019 ఎన్నికల ముందు వివేకా హత్య
  • సుదీర్ఘకాలంగా న్యాయపోరాటం చేస్తున్న వివేకా కుమార్తె
  • ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ 
2019 ఎన్నికల ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ కేసును సీబీఐ చేపట్టినప్పటికీ, ఇప్పటివరకు ఓ కొలిక్కిరాలేదు. తన తండ్రి హంతకులకు శిక్ష పడేందుకు వివేకా కుమార్తె వైఎస్ సునీత సుదీర్ఘకాలంగా న్యాయపోరాటం చేస్తున్నారు.

తాజాగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆమె ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వివేకా హత్య కేసులో నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 2024 సెప్టెంబరులో కూడా సునీత, తన భర్తతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. తాజాగా మరోసారి తన తండ్రి హత్య అంశాన్ని చంద్రబాబు వద్ద ప్రస్తావించారు.
YS Sunitha
YS Vivekananda Reddy
Chandrababu Naidu
Viveka murder case
Andhra Pradesh
Amaravati
CBI investigation
AP CM
Political crime
Justice for Vivekananda Reddy

More Telugu News