Bogatha Waterfalls: బొగత జలపాతం తాత్కాలిక మూసివేత... ఆ జలపాతాలు శాశ్వత మూసివేత

Bogatha Waterfalls temporarily closed due to heavy rains
  • ఈ నెల 26వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం
  • కుండపోత వర్షాల కారణంగా పరవళ్లు తొక్కుతున్న జలపాతం
  • భద్రతా కారణాల దృష్ట్యా మూసివేత
  • ముత్యందార, కొంగల, మామిడిలొద్ది, కృష్ణాపురం జలపాతాల శాశ్వత మూసివేత
తెలంగాణలోని ప్రముఖ బొగత జలపాతాన్ని తాత్కాలికంగా మూసివేయాలని తెలంగాణ అటవీ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున, ములుగు జిల్లాలోని వాజేడు వద్ద ఉన్న బొగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 26వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు జలపాతం మూసి ఉంటుందని ములుగు జిల్లా అటవీ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బొగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అధికారులు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.

అలాగే, ముత్యందార, కొంగల, మామిడిలొద్ది, కృష్ణాపురం జలపాతాలను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. పర్యాటకులను ఆయా జలపాతాల వద్దకు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ సూచనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసు కేసు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
 
Bogatha Waterfalls
Telangana
waterfalls
Mulugu district
heavy rains
tourist safety

More Telugu News