ఆత్మహత్యకు పాల్పడిన టీచర్… భరించలేక భర్త ఆత్మహత్యాయత్నం

  • ఏలూరు జిల్లాలో ఘటన
  • పుట్టినరోజు మర్నాడే విషాదం
  • ఫ్యాన్ కు ఉరేసుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు
  • కాళ్లు, చేతులు కోసుకున్న భర్త
ఏలూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దేవిక అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మరణంతో భర్త కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. చిన్ని సురేంద్ర, దేవిక ఏలూరు జిల్లా చొదిమెలలో నివాసం ఉంటున్నారు. వారిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. దేవిక నిన్న పుట్టినరోజు కూడా జరుపుకుంది. 

అయితే, ఇవాళ పాఠశాల నుంచి తిరిగొచ్చిన ఆమె ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణం చెందింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా భార్య నుంచి స్పందన లేకపోవడంతో సురేంద్ర హుటాహుటీన ఇంటికి వచ్చి చూడగా, భార్య విగతజీవురాలిగా కనిపించింది. అది చూసి తట్టుకోలేక సురేంద్ర కాళ్లు, చేతులపై కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News