Vijay Antony: ఓటీటీలో తమిళ క్రైమ్ థ్రిల్లర్ .. 'మార్గన్'

Maargan Movie Update
  • విజయ్ ఆంటోని హీరోగా 'మార్గన్'
  • జూన్ లో థియేటర్లలో రిలీజ్ 
  • 14 కోట్లు వసూలు చేసిన సినిమా
  • ఈ నెల 25 నుంచి అమెజాన్ ప్రైమ్ లో

తమిళ క్రైమ్ థ్రిల్లర్ ఒకటి ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన ఆ సినిమా పేరే 'మార్గన్'. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విజయ్ ఆంటోని సొంత బ్యానర్లోనే నిర్మితమైంది. సాధారణంగా విజయ్ ఆంటోని సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతూ ఉంటాయి. అలాగే ఈ సినిమా కూడా రెండు భాషల్లోను థియేటర్లకు వచ్చింది. 

'మార్గన్' మూవీని జూన్ 27వతేదీన విడుదల చేశారు. 12 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా, 14 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. విజయ్ ఆంటోనీతో పాటు సముద్రఖని కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషించాడు. ఈ సినిమాకి విజయ్ ఆంటోని సంగీతాన్ని అందించడం విశేషం. అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'అమెజాన్ ప్రైమ్' వారు దక్కించుకున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. 

ఈ సినిమాలో విజయ్ ఆంటోని పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. నగరంలో వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతూ ఉంటాయి. ఎలా హత్య చేస్తున్నారనే విషయం తెలియగానే, తన కూతురు కూడా ఆ విధంగానే చనిపోవడం గుర్తొచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ షాక్ అవుతాడు. హంతకుడు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అతనిని పట్టుకోవడానికి ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు? అనే మలుపులతో ఈ కథ నడుస్తుంది. 

Vijay Antony
Morgan Movie
Tamil Crime Thriller
Amazon Prime
Samuthirakani
OTT Release
Telugu Dubbed Movie
Crime Investigation
Tamil Cinema
Police Officer

More Telugu News