Unnao harassment: నెలల తరబడి వేధింపులు భరించలేక... ఆకతాయికి నడివీధిలో దేహశుద్ధి చేసిన యువతి

Unnao Girl Thrashes Harasser on Street After Months of Abuse
  • ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావోలో ఘటన
  • ఆకతాయికి ఎదురుతిరిగిన యువతి
  • యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావోలో ఓ విద్యార్థిని చాలా కాలంగా తనను వేధిస్తున్న ఓ యువకుడికి నడిరోడ్డుపై చెప్పులతో దేహశుద్ధి చేసింది.  గంగాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోనీ రోడ్డులో ఉన్న నీలమ్ స్వీట్ హౌస్ సమీపంలో ఈ ఘటన జరిగింది. విద్యార్థిని ధైర్యంగా స్పందించి యువకుడికి తగిన గుణపాఠం నేర్పింది.

బాధిత విద్యార్థిని తెలిపిన వివరాల ప్రకారం, స్కూల్‌కు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు సదరు యువకుడు ఆమెను తరచుగా ఈవ్ టీజింగ్‌కు గురిచేసేవాడు. అతని వేధింపులు రోజురోజుకు శృతి మించిపోవడంతో తీవ్ర అసహనానికి గురైన విద్యార్థిని, ధైర్యం చేసి అతడిని అడ్డుకుని చెప్పుతో కొట్టింది. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరుపక్షాలను విచారించారు. నిందితుడైన యువకుడు బ్యాటరీ రిక్షా కంపెనీలో వాటర్ సప్లై విభాగంలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈవ్ టీజింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
Unnao harassment
Uttar Pradesh
eve teasing
student assault
Ganga Ghat police station
Neelam Sweet House
roadside assault
viral video
battery rickshaw company

More Telugu News